రాయలసీమ ఎత్తిపోతలపై కోర్టు ధిక్కరణ పిటిషన్ ను విచారించిన ఎన్జీటీ

  • రాయలసీమ ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ
  • పనులు నిలిపివేయాలని గతంలో ఆదేశాలు
  • ఏపీ సర్కారుపై గవినోళ్ల శ్రీనివాస్ ఆరోపణ
  • పనులు కొనసాగిస్తోందని వెల్లడి
  • ఎన్జీటీలో కోర్టు ధిక్కరణ పిటిషన్
రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ నేడు విచారణ చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలంటూ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పనులు కొనసాగిస్తోందని తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఇటీవలే సందర్శించిన కేఆర్ఎంబీ బృందం నివేదికను నేడు ఎన్జీటీకి అప్పగించింది. ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి కలిగే ముప్పుపై నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ గతంలోనే కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, నివేదిక సమర్పించేందుకు సమయం కావాలని కేంద్రం కోరడంతో తదుపరి విచారణను ఎన్జీటీ చెన్నై బెంచ్ వచ్చే నెల 8కి వాయిదా వేసింది.


More Telugu News