మరోసారి భారీ పేలుడుతో దద్దరిల్లిన ఆఫ్ఘన్ రాజధాని కాబూల్
- ఇటీవల కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద పేలుళ్లు
- మరోసారి దాడులు జరగొచ్చన్న అమెరికా
- నిజమైన అమెరికా హెచ్చరికలు
- కాబూల్ నగరంలో రాకెట్ దాడి
- అమెరికా సేనలే లక్ష్యంగా పేలుడు
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఈ సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఇటీవల కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద జంట పేలుళ్ల ఘటనలో 150 మందికి పైగా హతులైన సంగతి తెలిసిందే. తాజాగా కాబూల్ నగరం మరోసారి భారీ పేలుడుతో ఉలిక్కి పడింది. అమెరికా సైనికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. రాకెట్లతో దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఇది కూడా ఐసిస్ పనే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద దాడిని ముందే అనుమానించిన అమెరికా... ఆ దాడుల తర్వాత కూడా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే మరోసారి కాబూల్ లో ఉగ్రదాడి చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, తాజా పేలుడు ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఒకరు చిన్నారి అని సమాచారం. మరణించినవారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రాకెట్ దాడిలో 10 ఇళ్లు దెబ్బతిన్నట్టు గుర్తించారు.