'అరణ్మనై 3' నుంచి వీడియో సాంగ్ రిలీజ్!

  • సుందర్ సి నుంచి మరో హారర్ కామెడీ
  • ఆర్య సరసన రాశి ఖన్నా 
  • ప్రతినాయక పాత్రలో సంపత్ రాజు
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
సుందర్ సి. దర్శకత్వంలో గతంలో వచ్చిన 'అరణ్మనై' తమిళనాట భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో 'కళావతి' పేరుతో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. 'అరణ్మనై 2' సినిమా 'చంద్రకళ' పేరుతో తెలుగులో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పుడు 'అరణ్మనై 3' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్య - రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాలో, సుందర్ సి కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇతర ముఖ్య పాత్రల్లో సంపత్ రాజు .. నళిని .. వివేక్ .. యోగిబాబు నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ వీడియో సాంగును రిలీజ్ చేశారు.
 
ఒక వైపున ఆర్య - రాశి ఖన్నా కాంబినేషన్లోని సాంగ్ ను చూపిస్తూనే, మరో వైపున దెయ్యం వలన బంగ్లాలో జరిగే చిత్రమైన సంఘటనలను చూపిస్తూ వెళ్లారు. మధ్యలో మేకింగ్ వీడియో షాట్స్ ను మిక్స్ చేశారు. ఈ సినిమాలో ప్రధానమైన విలన్ సంపత్ రాజు అనే విషయం అర్థమవుతోంది. త్వరలోనే  సినిమాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News