అపోలో ఫార్మసీపై సైబర్ దాడి.. 8 వేల కంప్యూటర్లకు ర్యాన్సమ్‌వేర్!
- సైబర్ దాడి కారణంగా నిలిచిపోయిన సేవలు
- నిమిషాల వ్యవధిలో ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్‌తో సేవల పునరుద్ధరణ
- హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అపోలో ఫిర్యాదు
దేశవ్యాప్తంగా ఉన్న అపోలో ఫార్మసీలపై సైబర్ నేరగాళ్లు నిన్న దాడికి పాల్పడ్డారు. ఏకంగా 8 వేల కంప్యూటర్లకు ర్యాన్సమ్‌వేర్ పంపించారు. దీంతో ఫార్మసీ సేవలకు ఒక్కసారిగా ఆటంకం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన అపోలో ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్ సాయంతో నిమిషాల వ్యవధిలోనే సేవలను పునరుద్ధరించారు.
హ్యాకర్లపై చర్యలు తీసుకోవాలంటూ అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ సీనియర్ జనరల్ మేనేజర్ రెడ్డప్ప హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. అయితే, ర్యాన్సమ్‌వేర్ కారణంగా తమ డేటా మాత్రం చోరీ కాలేదని తెలిపారు. ఫార్మసీలోని కంప్యూటర్లకు రక్షణగా కే5785, ఫ్రెండ్‌మైక్రో అనే యాంటీ వైరస్‌ను ఉపయోగిస్తున్నట్టు పేర్కొన్నారు.