ఏపీలో 40 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి
- పోలీసు విభాగంలో భారీగా ప్రమోషన్లు
- 2012 నుంచి పెండింగ్ లో ఉన్న అంశం
- ప్రమోషన్ కమిటీని నియమించిన సర్కారు
- కమిటీ సిఫారసుల మేరకు తాజా పదోన్నతులు
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు విభాగంలో భారీగా పదోన్నతులు కల్పించింది. సివిల్ విభాగంలో ఒకేసారి 40 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పదోన్నతి పొందిన డీఎస్పీలందరూ 2012 బ్యాచ్ కు చెందినవారు. అయితే వీరి పదోన్నతుల అంశం గత ఐదేళ్లుగా పెండింగ్ లో ఉంది. ఇటీవల వీరి పదోన్నతుల అంశాన్ని పరిశీలించిన ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.
పదోన్నతి కల్పించే అంశంలో డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. దీనిపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల అంశానికి సంబంధించి కోర్టుల్లో గానీ, ట్రైబ్యునల్ లో గానీ కేసులు పెండింగ్ లో ఉంటే, వాటిపై వచ్చే తీర్పులకు లోబడి ఉత్తర్వులు అమలు చేస్తామని వివరించారు.