లేటు వయసులో పదో తరగతి పాసైన హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా

  • గతంలో పదో తరగతి ఇంగ్లీషు పరీక్షలో ఫెయిల్
  • ఇటీవల మరోసారి పరీక్ష రాసిన మాజీ సీఎం
  • 88 మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ప్రకటన
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా పదో తరగతి పాసయ్యారు. గతంలో ఆయన పదో తరగతి పరీక్షలు రాసినప్పుడు ఇంగ్లీషు పరీక్షలో ఫెయిలయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల మరోసారి పరీక్ష రాసిన ఆయన ఉత్తీర్ణులైనట్లు తెలుస్తోంది. ఓపెన్ స్కూల్‌ విధానంలో ఇంటర్మీడియెట్‌లో ఆయన చేరారు.

కానీ కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే ఇంటర్ విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో 10వ తరగతిలో ఒక పరీక్షలో ఫెయిలైన కారణంగా చౌతాలా ఫలితాన్ని వెల్లడించలేదు. దీంతో ఆయన మళ్లీ ఈ పరీక్ష రాయాల్సి వచ్చింది. తాజాగా ఆయన ఇంగ్లీషు పరీక్షను 88 మార్కులతో పాసైనట్లు హర్యానా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది.

86 ఏళ్ల చౌతాలా ఇండియన్ లోక్ దళ్ (ఐఎల్‌సీ) పార్టీ ఛైర్ పర్సన్‌గా ఉన్నారు. ఉపాధ్యాయుల నియామకాల కుంభకోణంలో చౌతాలాతోపాటు మరో 53 మందిని దోషులుగా గుర్తించిన కోర్టు.. ఆయనకు పదేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.


More Telugu News