ప్రస్తుతం రాష్ట్రంలో వందల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి: కేటీఆర్
- రాష్ట్రంలో కొవిడ్-19ను నియంత్రించాం
- వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ ముందు వరుసలో ఉంది
- మహీంద్రా గ్రూప్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది
తెలంగాణలో కరోనా వ్యాప్తిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్, సనత్‌నగర్ సెయింట్ థెరిస్సా ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో కొవిడ్-19ను నియంత్రించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. అంతేగాక, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఆయన చెప్పారు.
సెయింట్ థెరిస్సాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు ఏడు అంబులెన్స్‌లను మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ విరాళంగా ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఆ గ్రూప్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోందని అభినందించారు. మహీంద్రా గ్రూప్ జహీరాబాద్‌లో లక్ష పైచిలుకు ట్రాక్టర్లు తయారుచేస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లోనే టెక్ మహీంద్రా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని తెలిపారు. ఆ సంస్థ కార్యకలాపాలను వరంగల్‌లోనూ విస్తరించారని మంత్రి చెప్పారు.