నిత్యావసరాల సరఫరా సేవలను నిలిపివేస్తున్న జొమాటో

  • ఈ సేవల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం ఇది రెండోసారి
  • ఆర్డర్లు వస్తున్నంత వేగంగా సరుకులు అందించలేకపోతుండడమే కారణం
  • నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్‌లో రూ. 745 కోట్ల పెట్టుబడి
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి నిత్యావసరాల సరఫరా సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో కొవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో జొమాటో గతేడాది నిత్యావసర సరుకుల సరఫరాలోకి దిగింది. అప్పట్లో డిమాండ్ బాగానే ఉండడంతో సేవలు చురుగ్గానే అందించింది. అయితే, కరోనా ఉద్ధృతి తగ్గడంతో ఆహార పదార్థాలకు ఆర్డర్లు పెరగడం ప్రారంభమైంది.

ఈ క్రమంలో ఆర్డర్లు వస్తున్నంత వేగంగా సరుకులు అందించలేకపోతుండడంతో అప్పట్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎంపిక చేసిన నగరాల్లో మాత్రం ముప్పావుగంటలోపే నిత్యావసర సరుకులు అందిస్తామంటూ ఈ ఏడాది జులైలో మళ్లీ ప్రకటించింది. ఇప్పుడు మరోమారు ఆ సేవల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. కాగా, నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్‌లో జొమాటో దాదాపు రూ. 745 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.


More Telugu News