‘సాక్షి’పై కోర్టు ధిక్కరణ కేసు.. విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ
- జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేశారంటూ 'సాక్షి'లో కథనం
- కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన రఘురామ
- మరికాసేపట్లో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై తీర్పు
తీర్పు రాకముందే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేశారంటూ సాక్షిలో వార్త ప్రచురించడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై సీబీఐ కోర్టు స్పందించింది. ఆ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.
ఇదిలా ఉంటే, మరికాసేపట్లో జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు తీర్పును వెలువరించనుంది. మరోపక్క, ఆ కేసును సీబీఐ కోర్టు నుంచి వేరే కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ రఘురాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.