హీరోయిన్ నందితా శ్వేత ఇంట విషాదం

  • నందితా శ్వేత తండ్రి కన్నుమూత
  • ఆయన వయసు 54 సంవత్సరాలు
  • సానుభూతిని తెలియజేస్తున్న సినీ ప్రముఖులు
'ఎక్కడకు పోతావు చిన్నవాడా'తో పాటు పలు సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ నందితా శ్వేత ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివస్వామి కన్నుమూశారు. ఈ విషయాన్ని నందిత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 54 ఏళ్ల వయసులో తన తండ్రి కన్నుమూశారని తెలిపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పింది. ఈ విషయాన్ని తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నానని తెలిపింది.

ఈ విషాదం గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెకు సానుభూతిని తెలుపుతున్నారు. కన్నడ ఇండస్ట్రీ ద్వారా నందిత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'నంద లవ్స్ నందిత' ఆమె తొలి చిత్రం. ఆ తర్వాత పలు భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.


More Telugu News