భారత మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కోసం టాటా, ఎయిర్ బస్ భారీ డీల్!
- 56 సీ-295 విమానాల కోసం భారత రక్షణశాఖ, స్పేస్ స్పెయిన్ ల మధ్య ఒప్పందం
- తొలి 16 విమానాలను భారత్ కు అందించనున్న ఎయిర్ బస్
- మిగిలిన 40 విమానాలను ఇండియాలోనే తయారు చేయనున్న టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్
రక్షణ రంగానికి అవసరమైన సీ-295 రవాణా విమానాలకు సంబంధించి భారత రక్షణ శాఖ, స్పేస్ స్పెయిన్ సంస్థల మధ్య ఈరోజు ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ రూ. 20 వేల కోట్ల రూపాయలు. ఈ ఒప్పందం కింద భారత్ రక్షణశాఖకు 56 విమానాలు అందనున్నాయి. సీ-295 విమానాలు పాత ఏవీఆర్వో-748 విమానాల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి.
ఈ డీల్ ప్రకారం తొలి 16 విమానాలను ఎయిర్ బస్ సంస్థ భారత్ కు అందజేస్తుంది. ఆ తర్వాత మిగిలిన 40 విమానాలను ఇండియాలోనే టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ తయారు చేస్తుంది. ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఇండస్ట్రియల్ పార్టనర్ షిప్ కింద ఇండియాలోనే వీటిని తయారు చేస్తుంది.
ఈ సందర్భంగా టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా మాట్లాడుతూ, ఎయిర్ బస్ డిఫెన్స్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ సంస్థల మధ్య కుదిరిన ఈ జాయింట్ ప్రాజెక్ట్ ఒప్పందం భారత్ లోని ఏవియేషన్, ఏవియానిక్స్ ప్రాజెక్టులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ఎయిర్ క్రాఫ్ట్ ను భారత్ లోనే పూర్తి స్థాయిలో తయారు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.