ఏడేళ్లుగా చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారు: బండి సంజయ్
- దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి
- దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
- కేసీఆర్ దళితులను మోసం చేశారు
- తొలి ముఖ్యమంత్రి దళితుడే అనిచెప్పి, మొదటి మోసమే చేశారు
దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, 2014, 2018 ఎన్నికల సందర్భంగా దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. ఏడేళ్లుగా కేసీఆర్ దళితులకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకానికి తెరలేపారని బండి సంజయ్ ఆరోపించారు.
దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో ఎంచుకుని కేవలం ఆ నియోజక వర్గంలో, మరో నాలుగు నియోజక వర్గాల్లోని నాలుగు మండలాల్లో మాత్రమే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటూ అనేక సార్లు ప్రకటించిన కేసీఆర్.. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మోసమే దళితులకు చేశారని బండి సంజయ్ విమర్శించారు. హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.