అమెజాన్ ప్రైమ్ కి సూర్య 'జై భీమ్' .. నవంబర్ 2 నుంచి స్ట్రీమింగ్!

  • యథార్థ సంఘటన ఆధారంగా సూర్య సినిమా
  • న్యాయవాది పాత్రలో సూర్య
  • కథానాయికగా రజీషా విజయన్
  • నవంబర్ 2 నుంచి అమెజాన్ లో
మొదటి నుంచి కూడా సూర్య వైవిధ్యభరితమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. బయోపిక్ గా వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాకు, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఆయన ఒక యథార్థ సంఘటన ఆధారంగా 'జై భీమ్' సినిమా చేశాడు. తన సొంత బ్యానర్ పై సూర్య ఈ సినిమా నిర్మించాడు.

ఈ సినిమాలో సూర్య న్యాయవాదిగా కనిపించనున్నాడు. ఒక కేసులో సామాన్యులకి అన్యాయం జరుగుతూ ఉండటం చూసి, వారి తరఫున నిజాయతీగా పోరాడిన ఒక న్యాయవాది కథ ఇది. బలమైన ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. జ్ఞానవేల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చినట్టుగా చాలా రోజుల క్రితమే చెప్పారు. నవంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ జరగనున్నట్టు తాజాగా ప్రకటించారు. సూర్య సరసన నాయికగా రజీషా విజయన్ నటించగా, ఒక కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.


More Telugu News