సమంత, నాగచైతన్య విడిపోవడంపై ఖుష్బూ, నిహారిక స్పందన
- వాళ్లు ఎందుకు విడిపోయారో ఎవరికీ తెలియదన్న ఖుష్బూ
- అనవసర ఊహాగానాలు చేయవద్దని విన్నపం
- మీరు బతుకుతూ పక్క వాళ్లని బతకనివ్వాలన్న నిహారిక
తాము విడిపోతున్నామంటూ సమంత, నాగచైతన్య ప్రకటించడం అందరినీ షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సినీ ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సీనియర్ నటి ఖుష్బూ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... వాళ్లు ఎందుకు విడిపోయారనేది వాళ్లిద్దరికి తప్ప మరెవరికీ తెలియదని చెప్పారు. జరిగిన విషయం వాళ్లిద్దరి మధ్యే ఉంటుంది. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడేందుకు వారికి సమయాన్ని ఇవ్వాలని చెప్పారు. వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారనే అంశంపై అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని కోరారు.
మరోవైపు కొణిదెల నిహారిక స్పందిస్తూ... 'మీరు బతకండి. పక్కవాళ్లని బతకనివ్వండి' అని వ్యాఖ్యానించింది.
మరోవైపు కొణిదెల నిహారిక స్పందిస్తూ... 'మీరు బతకండి. పక్కవాళ్లని బతకనివ్వండి' అని వ్యాఖ్యానించింది.