ఐపీఎల్ కొత్త జట్ల విలువ 2-3 వేల కోట్లు పలకొచ్చు: నెస్ వాడియా
- వచ్చే ఏడాది నుంచి కొత్తగా రెండు జట్లు
- కొత్త ఆటగాళ్లకు అవకాశం వస్తుందన్న వాడియా
- అక్టోబర్ 25 న అధికారిక ప్రకటన
ఐపీఎల్ లో వచ్చే ఏడాది రెండు కొత్త జట్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ జట్లు ఒక్కోటి రూ. 2 వేల నుంచి రూ. 3 వేల కోట్లు విలువ చేస్తాయని పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని నెస్ వాడియా చెప్పారు. ఈ జట్ల పేర్లను అక్టోబర్ 25 న అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ క్రమంలో కొత్త జట్ల విలువ 50 శాతం నుంచి వంద శాతం పెరగొచ్చని వాడియా అభిప్రాయపడ్డారు.
ఇలా కొత్త జట్లు రావడం అందరికి మంచిదని చెప్పారు. ఈ కొత్త టీమ్స్ చేరిక ఐపీఎల్‌తోపాటు ఇప్పుడున్న ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లకు కూడా మంచే చేస్తుందని అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ లో మొత్తం ఎనిమిది జట్లు ఉన్నాయి. కొత్త జట్ల చేరికతో సంఖ్య పదికి చేరుతుంది. దీనివల్ల కొత్త ఆటగాళ్లకు కూడా అవకాశాలు లభిస్తాయని వాడియా చెప్పారు.