భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 555 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 176 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- మధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాయి. అయితే, యూరప్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతుండటంతో... మన దేశీయ సూచీల సెంటిమెంట్ దెబ్బతింది.
కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు అనుసరించిన సర్దుబాటు ధోరణికి ఆర్బీఐ ముగింపు పలకబోతోందనే సంకేతాలు కూడా ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 555 పాయింట్లు నష్టపోయి 59,189కి పడిపోయింది. నిఫ్టీ 176 పాయింట్లు కోల్పోయి 17,646 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.24%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.08%), బజాజ్ ఫైనాన్స్ (0.08%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.38%), టాటా స్టీల్ (-2.81%), సన్ ఫార్మా (-2.39%), బజాజ్ ఆటో (-2.38%), టాటా స్టీల్ (-2.81%).