విజయవాడలో నేటి నుంచి 'హెలీ రైడ్'
- హెలికాప్టర్ ద్వారా బెజవాడ సోయగం వీక్షించే చాన్స్
- టూరిజం శాఖ, దుర్గగుడి ఆధ్వర్యంలో హెలీ రైడ్
- 6 నిమిషాల వాయు విహారానికి రూ.3,500
- 13 నిమిషాలకు రూ.6 వేలు
విజయవాడ నగర అందాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి ఈ నెల 17 వరకు విజయవాడలో హెలీ రైడ్ సేవలు అందించనున్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలీ రైడ్ నిర్వహిస్తారు. టూరిజం విభాగం, దుర్గమ్మ ఆలయ బోర్డు సంయుక్తంగా ఈ హెలీ రైడ్ ను నిర్వహిస్తున్నాయి.
ఇందులో భాగంగా 6 నిమిషాల పర్యటనకు రూ.3,500, 13 నిమిషాల గగన విహారానికి రూ.6 వేలుగా ధరలు నిర్ణయించారు. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ స్పందిస్తూ, హెలీ రైడ్ ను దుర్గమ్మ భక్తులు, ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.