తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కు సెలవు దినాలను ప్రకటించిన ప్రభుత్వం

  • పండుగ సందర్భంగా 14, 15, 16 తేదీల్లో వ్యాక్సినేషన్ కు సెలవు
  • ఈ నెలలో అన్ని ఆదివారాల్లో వ్యాక్సిన్ హాలిడే
  • రాష్ట్రంలో జోరుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. స్పెషల్ డ్రైవ్స్ ను కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం... విస్తృతంగా టీకాలు వేయిస్తోంది. అయితే వ్యాక్సినేషన్ కు కొన్ని రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ ఇచ్చింది.

పండుగ నేపథ్యంలో రేపు (14వ తేదీ) సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ ను విన్నవించారు. దీంతో రేపు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పాటు అదనంగా 15, 16 తేదీల్లో కూడా వ్యాక్సిన్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ఈ నెలలో అన్ని ఆదివారాల్లో వ్యాక్సిన్ కార్యక్రమానికి విరామాన్ని ప్రకటించారు.


More Telugu News