భారీ లాభాల్లోకి వెళ్లి.. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 49 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 58 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 6 శాతానికి పైగా పడిపోయిన ఐటీసీ షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్ సర్వ్ వంటి కంపెనీల అండతో మళ్లీ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు 62,250 వరకు ఎగబాకింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో చివరకు మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 61,716కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 18,418 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (4.12%), ఎల్ అండ్ టీ (3.26%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.99%), ఇన్ఫోసిస్ (1.63%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.13%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-6.23%), హిందుస్థాన్ యూనిలీవర్ (-4.06%), టైటాన్ కంపెనీ (-3.97%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.73%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.60%).