బాలీవుడ్ దర్శకుడితో ఎన్టీఆర్ చారిత్రక చిత్రం?
- త్వరలో కొరటాలతో సెట్స్ పైకి
- ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీ
- లైన్లో సంజయ్ లీలా భన్సాలి
- చారిత్రక నేపథ్యంలో సాగే కథ
టాలీవుడ్ హీరోలందరి కన్ను ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే ఉంది. ఒక వైపున ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. మరో వైపున చరణ్ అడుగులు కూడా అటుగానే పడుతున్నాయి. ఆల్రెడీ ఆయన శంకర్ సినిమాను పట్టాలెక్కించేశాడు. ఈ సినిమా షూటింగు మొదలైపోయింది.
ఇక ఎన్టీఆర్ కూడా ఆ దిశగానే కదులుతున్నాడు. కొరటాల సినిమా తరువాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఆ తరువాత సినిమాను ఆయన బాలీవుడ్ దర్శకుడితో చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలితో ఆయన ఒక సినిమా చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. 'బాజీరావ్ మస్తానీ' .. 'పద్మావత్' వంటి భారీ హిట్ చిత్రాలను అందించిన సంజిత్ లీలా భన్సాలి, ఎన్టీఆర్ తో ఒక చారిత్రక చిత్రాన్ని చేయనున్నారని అంటున్నారు. ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని చెబుతున్నారు. ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.