బన్నీగారు బంగారం... చాలా బాగా చెప్పారు: గేయ ర‌చ‌యిత‌ రామ‌జోగ‌య్య శాస్త్రి

  • గేయ ర‌చ‌యిత‌ల‌పై అల్లు అర్జున్ ప్ర‌శంస‌ల జ‌ల్లు
  • రచయితలను గౌరవించడం అంటే అమ్మభాషను గౌరవించుకోవడమ‌న్న రామ‌జోగ‌య్య శాస్త్రి
  • సాహిత్యానికి సంస్కారానికి పెద్దపీట వెయ్యడమ‌ని వ్యాఖ్య
సినీనటుడు అల్లు అర్జున్ ఓ అవార్డు వేడుకలో గేయ ర‌చ‌యిత‌ల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. 'అల.. వైకుంఠ‌పుర‌ములో' సినిమాకు గాను పాట‌లు రాసిన వారిని ఆయ‌న పేరుపేరునా గుర్తు చేసుకున్నాడు. భాష త‌న‌కు అంత‌గా తెలియ‌కపోయినా తెలుగు సాహిత్యం విలువ ఏంటో తెలుస‌ని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒక‌రు గేయ ర‌చ‌యిత రామ‌జోగయ్య శాస్త్రికి పోస్ట్ చేశారు.

'అల్లు అర్జున్ గారు అవార్డు వేడుకలో మీ గురించి తలచుకున్న సందర్భం ఇది. సిరివెన్నెల గారు, వేటూరి గారు ఎన్నో గొప్ప పాటలు రాశారు. మీరు గొప్ప పాటలు రాయడం మాత్రమే కాకుండా, తెలుగు పాటల రచయితలకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చారు' అని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు.

'నిరంతరం సామాజిక మాధ్యమాల ద్వారా లిరిక్స్ ని జనబాహుళ్యంలోకి తీసుకొని వెళ్తూ, సినీ ప్రియుల స్పందనని లైక్ ద్వారా లేక షేర్ చెయ్యడం ద్వారా వాళ్లలో ఉత్సాహాన్ని పెంపొందిస్తూ, తెలుగు పాటల రచయితల గౌరవాన్ని పెంచారు. మీ ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆశిస్తున్నాను' అని పేర్కొన్నారు. ఆయ‌న ట్వీట్ ను రీట్వీట్ చేసిన రామ జోగయ్య శాస్త్రి బ‌న్నీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
 
'బన్నీ గారు బంగారం... చాలా బాగా చెప్పారు... రచయితలను గౌరవించడం అంటే అమ్మభాషను గౌరవించుకోవడం.. సాహిత్యానికి సంస్కారానికి పెద్దపీట వెయ్యడం.. వారి సౌజన్యానికి కృతజ్ఞతలు' అని రామ జోగ‌య్య శాస్త్రి పేర్కొన్నారు.


More Telugu News