ఎవరూ వద్దనలేదుగా... ఏపీలో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకోవచ్చు: సజ్జల

  • ఏపీలో టీఆర్ఎస్ పార్టీని పెడతామంటే ఎవరైనా వద్దన్నారా? 
  • శ్రీశైలం నీటితో తెలంగాణ అడ్డగోలుగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటోంది
  • రాష్ట్రం విడిపోతే ఏపీకి కష్టాలు వస్తాయని మేము ముందే చెప్పాం
టీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి రావాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వేలాది విన్నపాలు వచ్చాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీని పెడతామంటే ఎవరైనా వద్దన్నారా? అని ప్రశ్నించారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీని పెట్టకోవచ్చని... ఏపీలో టీఆర్ఎస్ పార్టీని కూడా పెట్టుకోవచ్చని అన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నీటిని అడ్డగోలుగా వాడుతూ విద్యుత్ ను ఉత్పత్తి చేసుకుంటున్నారని... అందుకే తెలంగాణలో కరెంట్ కష్టాలు లేవని సజ్జల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తే ఏపీకి కష్టాలు వస్తాయని, రాష్ట్రంలో అంధకారం నెలకొంటుందని, నీటి సమస్యలు తలెత్తుతాయని తాము ముందే చెప్పామని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు కరెంట్ కష్టాలు లేవని, ఏపీకి మాత్రం ఉన్నాయని చెప్పారు. విద్యుత్ కష్టాలను అధిగమించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందని అన్నారు.


More Telugu News