ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధాని, సీఎం జగన్ స్పందన
- తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్
- అభివృద్ధి విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది: వెంకయ్య నాయుడు
- ఏపీ ప్రజలు అనేక రంగాల్లో రాణిస్తున్నారు: మోదీ
- ప్రజల సహకారంతో అడుగులు ముందుకు వేస్తున్నా: జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ పొట్టిశ్రీరాములు గారి ఆత్మార్పణ ఫలితంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. అదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను' అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
'రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
'అమరజీవి పొట్టి శ్రీరాములుగారి లాంటి ఎంతోమంది మహానుభావుల ప్రాణత్యాగ ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం. వారు సాధించిన ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీ అందరి సహకారంతో అడుగులు ముందుకు వేస్తున్నా' అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు.