భారత్ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను గుర్తించిన మరో ఐదు దేశాలు
- భారత్ వ్యాక్సిన్లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై సానుకూలత
- ఇప్పటికే పలుదేశాల గుర్తింపు
- తాజాగా ప్రకటన చేసిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ
- పరస్పర విధానంలో భాగంగా కీలక పరిణామం
భారత వ్యాక్సిన్లపైనా, భారత్ జారీ చేసే కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పైనా ప్రపంచ దేశాల నుంచి క్రమంగా సానుకూలత వ్యక్తమవుతోంది. భారత్ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను తాజాగా మరో ఐదు దేశాలు గుర్తించాయి.
మారిషస్, మంగోలియా, ఎస్తోనియా, పాలస్తీనా, కిర్గిజ్ స్థాన్ దేశాలు భారత్ జారీ చేసే కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను గుర్తించాయని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి వెల్లడించారు. పరస్పర సహకార విధానంలో భాగంగానే ఆయా దేశాలు నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. ఈ క్రమంలో భారత్ కూడా పై ఐదు దేశాలు జారీ చేసే కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను గుర్తిస్తుందని బాగ్చి వివరించారు.