హుజూరాబాద్  ఓట్ల లెక్కింపు... 13 రౌండ్ల అనంతరం ఈటలదే పైచేయి

  • కొనసాగుతున్న ఈటల ఆధిక్యం 
  • 13వ రౌండ్ లో ఈటలకు 1,865 ఓట్ల ఆధిక్యం
  • మొత్తం మీద 8,388 ఓట్ల ఆధిక్యంతో ఈటల  
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 13 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 8,388 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 13వ రౌండ్ లో ఆయనకు 1,865 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ రౌండులో బీజేపీకి 4,836 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 2,971 ఓట్లు వచ్చాయి.

తొలి రౌండ్ నుంచి ఈటలదే పైచేయిగా నిలుస్తోంది. కేవలం, 8, 11వ రౌండ్లలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యంలో నిలిచారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో మరో 9 రౌండ్లు మిగిలున్నాయి.


More Telugu News