257 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 59 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3.27 శాతం నష్టపోయిన సన్ ఫార్మా షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో, మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257 పాయింట్లు నష్టపోయి 59,771కి పడిపోయింది. నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయి 17,829 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (3.99%), ఏసియన్ పెయింట్స్ (2.36%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.22%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.14%), టాటా స్టీల్ (0.87%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-3.27%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.79%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.97%), భారతి ఎయిర్ టెల్ (-1.95%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.87%).