నాలుగేళ్ల పాప కోసం 18 రోజులపాటు గాలించిన హెలికాప్టర్లు, నౌకలు.. కథ సుఖాంతం!
- నాలుగేళ్ల కుమార్తెతో కలిసి పర్యాటక ప్రాంతానికి
- ఉదయం లేచి చూసే సరికి పాప మాయం
- పాప ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల డాలర్ల బహుమతి ప్రకటన
- పాపను ఓ ఇంట్లో దాచిపెట్టిన కిడ్నాపర్ అరెస్ట్
ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన నాలుగేళ్ల పాప కోసం ఏకంగా హెలికాప్టర్లు, నౌకలు రంగంలోకి దిగిన అరుదైన ఘటన ఇది. ఆ పూర్వాపరాల్లోకి వెళ్తే.. జేక్ గిడ్డన్, ఎల్లీ స్మిత్ దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తె క్లియో స్మిత్‌తో కలిసి ఆస్ట్రేలియాలోని క్యూబా బ్లూహోల్స్ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. సముద్రతీరంలో అడవికి దగ్గరలో ఉన్న ఆ ప్రాంతంలోనే ఆ రాత్రి బసచేశారు.
అయితే, తెల్లారి లేచి చూసిన వారి గుండెలు అదిరిపోయాయి. చిన్నారి కనిపించకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె కోసం చుట్టుపక్కల గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ కుమార్తెను గుర్తించి రక్షించాలంటూ బహిరంగంగా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
దీంతో కదిలిన ప్రభుత్వం వంద మంది అధికారులను రంగంలోకి దింపింది. వలంటీర్లు కూడా పాప కోసం గాలింపు మొదలుపెట్టారు. మరోవైపు, నౌకలు, హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ కనిపించకపోవడంతో అందరిలోనూ ఆందోళన పెరిగింది. పాప క్షేమంగా ఉండాలని, తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాలని దేశం మొత్తం ఆకాంక్షించింది.
మరోవైపు, పాప ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల డాలర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాప గాలింపులో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించింది. చివరికి 18 రోజుల తర్వాత చిన్నారి ఆచూకీ లభించింది. ఆమెను ఓ దుండగుడు కిడ్నాప్ చేసి ఓ ఇంట్లో దాచిపెట్టినట్టు గుర్తించారు. చిన్నారి క్లియోను రక్షించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం.