భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు

  • కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా కలెక్టర్లతో జగన్ సమీక్ష
  • ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని సూచన
  • సహాయక శిబిరాల్లోని బాధితులను బాగా చూసుకోవాలని ఆదేశం
తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు చాలా అప్రమత్తతతో ఉండాలని సూచించారు. సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లో 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు.

ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన రెండు బృందాలు నెల్లూరుకు, మరో రెండు బృందాలు చిత్తూరుకు చేరుకున్నాయని... ఇంకో రెండు బృందాలు కర్నూలులో సిద్ధంగా ఉన్నాయని జగన్ చెప్పారు. అవసరాలను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. సహాయకశిబిరాలకు తరలించిన బాధితులను మంచిగా చూసుకోవాలని, మంచి ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. బాధితులకు అవసరార్థం వెయ్యి రూపాయల చెప్పున ఇవ్వాలని తెలిపారు. బాధితుల కోసం ఒక ప్రత్యేక ఫోన్ నెంబర్ ను అందుబాటులో ఉంచాలని చెప్పారు.


More Telugu News