ప్రేమించాలని డిసైడ్ అయితే యుద్ధం చేయాల్సిందే.. ఎల్లుండి నుంచి ‘శశివదనే’ షూటింగ్
- రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమం
- వెల్లడించిన చిత్ర నిర్మాత బెల్లంకొండ అహితేజ
- ఉబ్బన సాయిమోహన్ డైరెక్షన్ లో సినిమా
- హీరోహీరోయిన్లుగా రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్
కులం, స్థాయి, ప్రేమ.. అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘శశివదనే’. ఉబ్బన సాయి మోహన్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను బెల్లంకొండ అహితేజ నిర్మిస్తున్నారు. మంగళవారం (ఎల్లుండి) ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తున్నట్టు నిర్మాత అహితేజ వెల్లడించారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో రామానాయుడు స్టూడియోస్ లో ఆ రోజు ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి.. సినిమా షూటింగ్ ను మొదలుపెడతామని ప్రకటించారు.
ఈ సినిమాలో రక్షిత్ అట్లూరి కథానాయకుడు కాగా.. కోమలీప్రసాద్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని సెప్టెంబర్ లోనే చిత్ర బృందం ప్రకటించడం విశేషం. కులం, స్థాయి మధ్య ప్రేమ ఎలా గెలిచిందన్నదే ఆ కథాంశం. ‘‘ఒకే కులం కాదనుకో మా కులపోడు కాదూ అంటారు. ఒకవేళ ఒకే కులం అయినా.. మా స్థాయికి సరిపోరు అంటారు. కానీ, కులాన్ని, స్థాయిని చూసి ప్రేమ పుట్టదు కదరా. ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చినా యుద్ధం చేయాలంతే’’ అని సాగే ఓ చిన్న టీజర్ నూ గతంలో విడుదల చేశారు. ఆ టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.