డిసెంబరు 4 వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు.. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడి

  • బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు
  • అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు
  • ఈ నెల 27 నుంచి భారీ వర్షాలు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 27 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

అనంతపురం, కర్నూలు, విజయనగరం, ఉభయగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


More Telugu News