రేషన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త.. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం గడువు పొడిగింపు

  • మరో నాలుగు నెలలపాటు పొడిగింపు
  • ప్రతి ఒక్కరికీ అదనంగా ఐదు కిలోల చొప్పున బియ్యం
  • దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి లబ్ధి
రేషన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) గడువును మరో నాలుగు నెలలపాటు పొడిగించింది. ఫలితంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యానికి అదనంగా ప్రతి ఒక్కరికీ 5 కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

తాజా నిర్ణయంతో వచ్చే ఏడాది మార్చి వరకు ఈ పథకం అమల్లో ఉండనుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. అదనంగా ఇచ్చే బియ్యానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్రమే భరిస్తోంది.


More Telugu News