జయలలిత నివాసాన్ని ఆమె మేనకోడలికి అప్పగించండి: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
- స్మారక మందిరంగా జయలలిత నివాసం
- గత ప్రభుత్వం ఉత్తర్వులు
- కోర్టును ఆశ్రయించిన జయ మేనకోడలు దీప
- అన్నాడీఎంకే సర్కారు ఉత్తర్వులు కొట్టివేసిన ధర్మాసనం
పురచ్చి తలైవి జయలలిత నివాసాన్ని స్మారక మందిరంగా మార్చాలన్న ప్రయత్నాలకు మద్రాస్ హైకోర్టు అడ్డుచెప్పింది. చెన్నైలోని పొయెస్ గార్డెన్ లో ఉన్న జయలలిత ఇంటిని స్మారక మందిరంగా మార్చేందుకు అప్పట్లో అన్నాడీఎంకే సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ కోర్టును ఆశ్రయించారు. వారు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పొయెస్ గార్డెన్ నివాసాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు వీల్లేదని, ఆ ఇంటిని జయలలిత మేనకోడలు, చట్టబద్ధ వారసురాలు దీపకు అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. అందుకు మూడు వారాలు గడువు ఇచ్చింది. జయలలిత ఆస్తులపై ప్రభుత్వానికి హక్కు లేదని స్పష్టం చేసింది. మాజీ సీఎం జయలలిత నివాసం చెన్నైలోని ఆళ్వార్ పేటలో ఖరీదైన ప్రాంతంగా పేరుగాంచిన పొయెస్ గార్డెన్ ఏరియాలో ఉంది. దీనికి వేద నిలయంగా పేరుంది.