మహిళతో ఎస్సై అక్రమ సంబంధం... ఎస్సైని ఉతికారేశారు!

  • వనపర్తి ఎస్సై ఘనకార్యం
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మహిళ భర్త
  • కొట్టొద్దని ప్రాధేయపడిన ఎస్సై
  • గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన వైనం
  • సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
మహిళతో ఎస్సై అక్రమ సంబంధం... ఎస్సైని ఉతికారేశారు!
వనపర్తి జిల్లాలో ఓ పోలీసు అధికారి బాధ్యతలు మరిచి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోగా, ఆ మహిళ భర్త, అతడి స్నేహితులు సదరు ఎస్సైకి దేహశుద్ధి చేశారు. వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో షేక్ షఫీ ఎస్సైగా పనిచేస్తున్నాడు. కొత్తకోటకు చెందిన ఓ మహిళతో ఎస్సై షఫీ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం మహిళ భర్తకు తెలిసింది. దాంతో అతడు పక్కా ప్లాన్ వేసి ఎస్సైని, తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇందులో అతడికి స్నేహితులు కూడా సహకరించారు.

ఇంకేముంది... ఆ ఎస్సైని ఉతికారేశారు. కొట్టొద్దని ఎస్సై ఎంత వేడుకున్నా మహిళ భర్త, అతని స్నేహితులు చితకబాదారు. ఎస్సైని ఏమీ అనవద్దంటూ భార్య అడ్డురాగా, భర్త లాగిపెట్టి గూబ గుయ్యిమనిపించాడు. ఇంతలో పోలీసులు రావడంతో ఆ ఎస్సై బతికిపోయాడు! గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి అక్రమ సంబంధం వ్యవహారం అధికారులకు తెలియడంతో విధుల నుంచి సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


More Telugu News