ఉత్కంఠను పెంచుతున్న 'మరక్కార్' ట్రైలర్!
- 'మరక్కార్'గా మోహన్ లాల్
- 16వ శతాబ్దం నాటి యోధుడి కథ
- దర్శకుడిగా ప్రియదర్శన్ మరో ప్రయోగం
- త్వరలో వివిధ భాషల్లో భారీ రిలీజ్
మోహన్ లాల్ కథానాయకుడిగా 'మరక్కార్' సినిమా రూపొందింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఆంటోని పెరంబవూర్ ఈ సినిమాను నిర్మించాడు. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కర్ అనే కేరళ పోరాట యోధుడి కథ ఇది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, భారీ స్థాయిలో వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పోర్చుగీసు వారు కేరళ ప్రాంతాన్ని ఆక్రమించడానికి రావడం .. వాళ్లను తన సైన్యంతో మరక్కార్ ఎదుర్కోవడం .. ఆయనను అంతం చేయడానికి వాళ్లు కొంత మంది స్వార్థపరుల సాయాన్ని తీసుకోవడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది.
బలమైన కథాకథనాలు .. భారీతనం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అలాగే ఆనాటి చారిత్రక వాతావరణాన్ని అద్భుతంగా క్రియేట్ చేయగలిగారు. అర్జున్ .. సునీల్ శెట్టి .. సుహాసిని .. కీర్తి సురేశ్ .. కల్యాణి ప్రియదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా సంచలనానికి తెరతీయనున్నట్టే కనిపిస్తోంది.