బూస్టర్ డోస్ పై రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- బెంబేలెత్తిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్
- బూస్టర్ డోస్ కోసం అదనపు వ్యాక్సిన్లను పంపాలన్న ఏపీ, కర్ణాటక, కేరళ
- బూస్టర్ డోస్ అవసరమని మీకెవరు చెప్పారని ప్రశ్నించిన కేంద్రం
కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ బెంబేలెత్తిస్తోంది. మరోవైపు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా మళ్లీ కరోనా బారిన పడుతుండటం అందరినీ కలవరపరుస్తోంది. దీంతో బూస్టర్ డోస్ వేయించుకుంటే మంచిదనే యోచనలో పలువురు ఉన్నారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ పంపిణీ కోసం వ్యాక్సిన్లను అదనంగా పంపాలంటూ ఏపీ, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ఈ విన్నపాన్ని కేంద్రం తిరస్కరించింది.
వివిధ రాష్ట్రాల వైద్యశాఖ అధికారులతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బూస్టర్ డోస్ అంశాన్ని ఈ మూడు రాష్ట్రాల అధికారులు లేవనెత్తారు. దీనిపై స్పందించిన కేంద్ర వైద్యశాఖ అధికారులు.. బూస్టర్ డోసు అవసరమని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఐసీఎంఆర్ సిఫారసు చేస్తే... అప్పుడు ఈ అంశంపై తాము ఆలోచిస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు బూస్టర్ డోసు ప్రస్తావనను ఎవరూ తీసుకురావద్దని అన్నారు.