దిశ నిందితుల ఎన్ కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమిషన్
- రెండేళ్ల కింద దిశ ఘటన
- నిందితుల ఎన్ కౌంటర్
- విచారణకు సిర్పూర్కర్ కమిషన్ ను నియమించిన సుప్రీం
- త్వరలో నివేదిక సమర్పించనున్న కమిషన్
రెండేళ్ల కిందట తెలంగాణలో దిశ ఘటన సంచలనం సృష్టించింది. 2019 డిసెంబరు 6న దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం తెలిసిందే. అయితే ఈ ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది.
ఈ క్రమంలో సిర్పూర్కర్ కమిషన్ బృందం నేడు షాద్ నగర్ మండలం చటాన్ పల్లిలో పర్యటించింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించింది. టోల్ గేట్ తో పాటు దిశ మృతదేహాన్ని దహనం చేసిన ప్రదేశాన్ని పరిశీలించింది. సిర్పూర్కర్ కమిషన్ రాక నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను కూడా మోహరించారు.