ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై కేసు నమోదు

  • జిలానీ అనే యువకుడిపై దాడి చేసిన ముంతాజ్ ఖాన్
  • ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జిలానీ
  • ఐపీసీ 341, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు
ఎంఐఐం పార్టీ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు సలాం కొట్టలేదనే కారణంతో జిలానీ అనే యువకుడిని కొట్టిన ఘటనలో ఆయనపై కేసు నమోదైంది. ఐపీసీ 341, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే, ఆదివారం అర్ధరాత్రి 12.43 గంటల సమయంలో చార్మినార్ బస్టాండ్ వద్ద ఉన్న తన ఇంటి అరుగు మీద మరో వ్యక్తితో కలసి కూర్చొని గౌస్ జిలానీ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ కారులో అటువైపు వచ్చాడు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తనను చూసి సలాం పెట్టవా? అంటూ కారు దిగి దుర్భాషలాడారు.

దీంతో తమరు వచ్చిన విషయాన్ని తాను చూడలేదని ఎమ్మెల్యేకు జిలానీ చెప్పాడు. ఆ తర్వాత అసలు సలాం ఎందుకు పెట్టాలని కూడా ప్రశ్నించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే జిలానీ చెంపలను వాయించాడు. ఈ ఘటనపై పోలీసులకు జిలానీ ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


More Telugu News