వైసీపీ నేతల కక్ష సాధింపు చర్యలకు గుడి, బడి తేడా లేకుండా పోయింది: చంద్రబాబు
- టీడీపీ నేత నిర్వహించే మదరసా సీజ్
- చంద్రబాబు ఆగ్రహం
- మదరసా స్థలాలపై వైసీపీ నేతల కన్నుపడిందని వెల్లడి
- కబ్జా చేస్తున్నారని వ్యాఖ్యలు
వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ధ్వజమెత్తారు. వైసీపీ నేతల కక్ష సాధింపు చర్యలకు గుడి, బడి తేడా లేకుండా పోయిందని విమర్శించారు. పేదలకు చదువు చెప్పే మదరసాను సీజ్ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ నడిపించే మదరసాపై అధికారులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపునకు ఇదే నిదర్శనమని తెలిపారు.
మదరసా స్థలాలపై ప్రభుత్వం కన్నుపడిందని, వేల ఎకరాల వక్ఫ్ భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వక్ఫ్ బోర్డు అధికారి మహబూబ్ బాషాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా మదరసాను కొనసాగించాలని కోరారు.