ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె.. నేడు, రేపు బ్యాంకుల బంద్

  • హైదరాబాద్‌లోని కోఠిలో సమ్మె ప్రారంభం
  • బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నమన్న ఉద్యోగ సంఘాలు
  • అడ్డుకునేందుకే సమ్మె చేపట్టామన్న యూఎఫ్‌బీయూ తెలంగాణ కన్వీనర్
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణలోని 70 వేల మంది ఉద్యోగులు రెండు రోజులపాటు సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు, రేపు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) తెలంగాణ కన్వీనర్ శ్రీరాం, అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.నాగేశ్వర్ తెలిపారు.

హైదరాబాద్‌లోని కోఠిలో సమ్మె ప్రారంభం కానుండగా, ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులతోపాటు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శ్రీరాం మాట్లాడుతూ.. బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని, దానిని అడ్డుకునేందుకు నేడు, రేపు దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్టు తెలిపారు.


More Telugu News