ఆరోగ్యవంతమైన కణాలు దెబ్బతినకుండా కేన్సర్ చికిత్స.. ‘రేడియో లెన్స్’ పరికరాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు
- హైపర్ థర్మియాలో వినియోగించేందుకు వీలు
- రోగి శరీరానికి దగ్గరగా పెట్టి చికిత్స
- అబుధాబిలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇనిస్టిట్యూట్ ఘనత
కేన్సర్ చికిత్స అంటేనే ఎంతో నొప్పితో కూడుకున్నది. జుట్టు రాలిపోతుంది.. ఒంట్లో సత్తువ తగ్గిపోతుంది.. ఆరోగ్యవంతమైన కణాలూ చచ్చిపోతుంటాయి. ఎన్నెన్నో సైడ్ ఎఫెక్ట్ లు వస్తుంటాయి. అయితే, ఆరోగ్యవంతమైన కణాలు చావకుండా, దుష్ప్రభావాలు ఎక్కువగా లేకుండా ఉండే సురక్షితమైన కొత్త ట్రీట్ మెంట్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అబుధాబిలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇనిస్టిట్యూట్ (టీఐఐ) శాస్త్రవేత్తలు.. కేన్సర్ ట్రీట్ మెంట్ కోసం సరికొత్త ‘రేడియో లెన్స్’ను అభివృద్ధి చేశారు. టీఐఐకి చెందిన డైరెక్టెడ్ ఎనర్జీ రీసెర్చ్ సెంటర్ (డీఈఆర్సీ) ఈ సూక్ష్మ తరంగ చికిత్స విధానాన్ని రూపొందించింది.
కేన్సర్ ట్రీట్ మెంట్ లో వాడే ‘హైపర్ థర్మియా (కేన్సర్ కణాలను సూక్ష్మ కాంతి తరంగాలతో వేడి చేసి చంపేయడం)’ విధానంలో ఈ రేడియో లెన్స్ ను వాడుతారు. వాస్తవానికి కేన్సర్ పేషెంట్లలో ఆరోగ్యవంతమైన కణాలు దెబ్బతినకుండా ఈ సూక్ష్మ కాంతి తరంగాలను రోగి శరీరానికి అతి దగ్గరగా తీసుకొచ్చి ట్రీట్ మెంట్ చేయడంలో ఎన్నో ఏళ్లుగా సైంటిస్టులు విఫలమవుతున్నారు. ఈ రేడియో లెన్స్ తో ఆ లోటు తీరుతుందని చెబుతున్నారు.
రోగి శరీరానికి దగ్గరగా ఈ లెన్స్ ను పెట్టి చికిత్సను చేసేందుకు వీలవుతుందని, ఆరోగ్యవంతమైన కణాలూ దెబ్బతినవని అంటున్నారు. కేవలం అవసరమైన చోట మాత్రమే ఇది ఫోకస్ చేస్తుందని, కేన్సర్ కణాలను మాత్రమే చంపుతుందని డీఈఆర్సీ ఆర్ ఎఫ్ అండ్ ఎలక్ట్రానిక్స్ చీఫ్ ఫెర్నాండో అల్బరాచిన్ వర్గాస్ చెప్పారు. రేడియో కాంతి తరంగాలను దగ్గరగా తీసుకొస్తే.. అవి మనిషి శరీరం లోపలికి వెళ్లి ఆరోగ్యవంతమైన కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, ఆ ప్రమాదం లేకుండా వివిధ తరంగదైర్ఘ్యాల్లో వివిధ పదార్థాలతో పొరలు పొరలుగా ఈ లెన్స్ ను తయారు చేశామని వివరించారు. ఎక్కువ తరంగదైర్ఘ్యాలతో ట్రీట్ మెంట్ ను అత్యంత కచ్చితత్వంతో చేయొచ్చని చెప్పారు. దీని ధర కూడా తక్కువేనని చెప్పారు.
కాగా, హైపర్ థర్మియాలో భాగంగా 113 డిగ్రీల ఫారెన్ హీట్ (45 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతల వద్ద ట్రీట్ మెంట్ ఇచ్చి కేన్సర్ కణాలను చంపేస్తారు. బ్రెస్ట్ కేన్సర్, బ్లాడర్ కేన్సర్, సెర్వికల్ కార్సినోమా, తల–మెడ కేన్సర్, మృదుకణజాల కేన్సర్, మెలనోమా వంటి చికిత్సల్లో హైపర్ థర్మియాను వినియోగిస్తున్నారు.