రేపు తిరుపతిలో చంద్రబాబు సతీమణి భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌ట‌న‌

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవల భారీ వర్షాలు
  • ఆస్తి, ప్రాణ న‌ష్టం
  • వరద బాధితులకు భువ‌నేశ్వ‌రి సాయం
  • మృతుల కుటుంబాల‌కు రూ.ల‌క్ష చొప్పున అందించ‌నున్న భువనేశ్వ‌రి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించిన విష‌యం తెలిసిందే. ప‌లు జిల్లాల్లో కురిసిన వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వరద బాధితులకు సాయం అందించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య‌ భువనేశ్వరి రేపు తిరుపతిలో పర్యటించాల‌ని నిర్ణ‌యించారు. మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరఫున రూ.లక్ష చొప్పున‌ ఆర్థిక సాయాన్ని అందిస్తారు.

మొత్తం 48 మంది కుటుంబాలకు ఆమె ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిసింది. ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా విరాళాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో ఇటీవల నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ వివాదం నెల‌కొన్న నేప‌థ్యంలో ఆమె తిరుప‌తిలో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం ప్రాధాన్యం సంతరించుకుంది.



More Telugu News