ఇక ఇలాగైతే కష్టమే .. ఈ హీరోలు హిట్టు కొట్టాల్సిందే!
- వరుస ఫ్లాపులతో శర్వానంద్
- దూకుడుగా వెళ్లిన నితిన్ కి నిరాశే
- అదే బాటలో నడిచిన నాగశౌర్య
- నెక్స్ట్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ
హీరోగా తెరపై కనిపించడం ఎంత కష్టమో .. హిట్టుకొట్టడం ఎంత కష్టమో .. స్టార్ స్టేటస్ ను అందుకోవడం ఎంత కష్టమో, అలా వచ్చిన క్రేజ్ ను కాపాడు కోవడం అంతకంటే కష్టం. అందువల్లనే ప్రతి హీరో కూడా ప్రతి సినిమాను తన ఫస్టు సినిమా అనుకునే జాగ్రత్త పడుతుంటాడు .. ఫస్టు సినిమాకంటే ఎక్కువగానే కష్టపడుతుంటాడు. ఇక్కడ హిట్టు పడితే కొత్తగా మరో రెండు సినిమాలు వస్తాయి. ఫ్లాప్ ముడితే నాలుగు అవకాశాలు వెనక్కి పోతాయి.
అందువల్లనే తమ ప్రతి సినిమా హిట్ కొట్టాలనే హీరోలంతా ఆశపడుతుంటారు .. ఆరాటపడుతుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అనుకున్నట్టుగా అన్నీ కుదరక కొన్ని సినిమాలు పోతూనే ఉంటాయి. అలా వరుస సినిమాలు దెబ్బతింటే మాత్రం ఆ హీరోలు డేంజర్ జోన్ లోకి వెళ్లిపోతారు. అలాంటి డేంజర్ జోన్ కి దగ్గరలోనే ఇప్పుడు కొంతమంది యంగ్ హీరోలు కనిపిస్తున్నారు.
శర్వానంద్ విషయానికి వస్తే, 'మహానుభావుడు' తరువాత మళ్లీ హిట్ పడలేదు. 'మహా సముద్రం' వరకూ చేసిన ప్రతి సినిమా దెబ్బతింటూనే వచ్చింది. ఇక నితిన్ కూడా ఎంత దూకుడుగా వెళ్లాడో అంతే వేగంగా ఫ్లాపుల బారిన పడ్డాడు. ఇక అదే బాటలో నడిచిన మరో హీరోగా నాగశౌర్య కనిపిస్తాడు. ఇద్దరూ వరుసగా మూడేసి ఫ్లాపులు ఇచ్చినవారే. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.