'పుష్ప' సినిమా కాపీ కథే.. నెటిజన్ల విమర్శలు!
- వెబ్ సిరీస్ 'నార్కోస్' కథ ఆధారంగా 'పుష్ప' తీశారని విమర్శలు
- అందులో డ్రగ్స్ ఉంటే.. ఇందులో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఉందంటున్న నెటిజన్లు
- బన్నీ తొలి పాన్ ఇండియా చిత్రాన్ని కాపీ కథతో తెరకెక్కించారని విమర్శలు
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన 'పుష్ప' చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. అయితే కాపీ కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ 'నార్కోస్' కథ ఆధారంగా 'పుష్ప'ను తీశారని విమర్శిస్తున్నారు.
'నార్కోస్'లో డ్రగ్స్ మాఫియా ఉంటే... 'పుష్ప'లో ఎర్రచందనం స్మగ్లింగ్ చూపించారని అంటున్నారు. వెబ్ సిరీస్ హీరో పాత్ర ఆధారంగా 'పుష్ప'లో అల్లు అర్జున్ పాత్ర ఉందని విమర్శిస్తున్నారు. కొండారెడ్డి బ్రదర్స్ పాత్రలు కూడా వెబ్ సిరీస్ ఆధారంగానే సుకుమార్ రాసుకున్నారని అంటున్నారు. అల్లు అర్జున్ తో తీసిన తొలి పాన్ ఇండియా చిత్రాన్ని కాపీ కథతో తెరకెక్కించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 'పుష్ప 2' షూటింగ్ ప్రారంభం కానుంది.