కరోనా కేసుల వివరాలు.. దేశంలో 415కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు
- దేశంలో కొత్తగా 7,189 కరోనా కేసులు
- ఒక్కరోజులో 387 మంది మృతి
- ప్రస్తుతం 77,032 క్రియాశీల కేసులు
- మృతుల సంఖ్య మొత్తం 4,79,520
దేశంలో కొత్తగా 7,189 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న కరోనా నుంచి 7,286 మంది కోలుకోగా, 387 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 77,032 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 3,42,23,263 మంది కోలుకున్నారు.
మృతుల సంఖ్య మొత్తం 4,79,520కు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 141.01 కోట్ల డోసుల వ్యాక్సిన్ వినియోగించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 415కు పెరిగింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ నుంచి 115 మంది కోలుకున్నారు.