పంచాయతీ అధికారుల అవినీతిపై గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు
- పశ్చిమ గోదావరి జిల్లా వేండ్ర పంచాయతీలో ఘటన
- అధికారుల అవినీతి జాబితా ఇదేనని ఫ్లెక్సీ
- పంచాయతీ నిధులను మళ్లించారని ఆరోపణ
- ఏసీబీతో విచారణ చేయించాలని డిమాండ్
సర్పంచ్, పంచాయతీ అధికారుల అవినీతిపై సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారు. అవినీతి అధికారులు వీరేనంటూ ఏకంగా ఫ్లెక్సీనే ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని వేండ్ర పంచాయతీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పంచాయతీలో పదేళ్లుగా అవినీతి పేరుకుపోయిందని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన వైసీపీ వార్డు సభ్యుడు కుక్కల సాయికృష్ణతోపాటు మరికొందరు గ్రామస్థులు కలిసి పంచాయతీ అధికారుల అవినీతి జాబితా ఇదేనంటూ గ్రామంలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
మోగల్లు పంచాయతీలో పనిచేస్తున్న కాటూరి రవికుమార్ పంచాయతీ నిధులను అదే గ్రామానికి చెందిన దిలీప్ ఖాతాలోకి మళ్లించారని ఈ సందర్భంగా సాయికృష్ణ ఆరోపించారు. దీని వెనక వేండ్ర పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సురేంద్ర, ప్రస్తుత వైసీపీ సర్పంచ్ ఉన్నారని ఆరోపించిన ఆయన.. వీరి అవినీతిపై ఏసీబీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.