సెంచురియన్ టెస్టు: రెండో రోజు ఆటకు వరుణుడి ఆటంకం

  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • తొలిరోజు ఆట చివరికి 3 వికెట్లకు 272 రన్స్
  • ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ
  • నేడు ఆలస్యంగా ప్రారంభం కానున్న ఆట
సెంచురియన్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభానికి వరుణుడు అడ్డుతగిలాడు. ఉదయం నుంచి వర్షం పడుతుండడంతో ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానం చిత్తడిగా మారింది. ఓసారి వర్షం ఆగడంతో మైదానంలోని నీటిని తొలగించేందుకు గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దిగారు. అంతలోనే మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో నీటి తొలగింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.

నిన్న తొలి రోజు ఆటను టీమిండియా 3 వికెట్లకు 272 పరుగుల వద్ద ముగించిన సంగతి తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్ (122 బ్యాటింగ్) అద్భుత సెంచరీ సాయంతో టీమిండియా సఫారీ జట్టుపై పైచేయి సాధించింది. క్రీజులో కేఎల్ రాహుల్ కు తోడు అజింక్యా రహానే (40 బ్యాటింగ్) ఉన్నాడు.


More Telugu News