కడప జిల్లాలో వైసీపీ మీటింగ్ రసాభాస.. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడా ముందే రెండు వర్గాల పరస్పర దాడులు
- రాజంపేట సుడుంపల్లి మండలం సర్వసభ్య సమావేశంలో రచ్చ
- రెండు వర్గాల మధ్య గతంలోనే విభేదాలు
- ఎంపీ, ఎమ్మెల్యేలతో కలసి పరిస్థితిని చక్కదిద్దిన పోలీసులు
కడప జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజంపేట సుడుంపల్లి మండలం సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడా, జిల్లాపరిషత్ ఛైర్మన్ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డిల ముందే వైసీపీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య ఎంపీ, ఎమ్మెల్యేలు ఇరుక్కుపోయారు.
ఈ క్రమంలో రాయచోటి రూరల్ సీఐ లింగప్ప మరికొందరు పోలీసులతో కలిసి అక్కడకు వచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో కలసి పరిస్థితిని చక్కదిద్దారు. గతంలోనే ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఘర్షణకు దారి తీశాయి. మరోవైపు ఈ గొడవ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని సుండుపల్లివాసులు భయపడుతున్నారు.