'బంగార్రాజు' పాట కూడా ఎంతమాత్రం తగ్గట్లేదు!
- షూటింగు పూర్తి చేసుకున్న 'బంగార్రాజు'
- సంక్రాంతి బరిలో దిగే ఛాన్స్
- బుల్లి బంగార్రాజుగా చైతూ
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
నాగార్జున కథానాయకుడిగా 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇటీవలే షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. పల్లెటూరు బుల్లోడుగా నాగార్జున కనిపించనుండగా, ఆయన సరసన నాయికగా రమ్యకృష్ణ అలరించనుంది. రొమాంటిక్ హీరోగా నాగ్ తనని తాను మరోసారి తెరపై ఆవిష్కరించుకోనున్నారు.
అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాలో, బుల్లి బంగార్రాజు పాత్రలో చైతూ కనిపించనున్నాడు. ఆయన జోడీగా కృతి శెట్టి అందాల సందడి చేయనుంది. నాగలక్ష్మి పాత్రలో ఆమె లుక్ ఆల్రెడీ యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు.
ఈ నెల ఫస్టు వీక్ లో ఈ సినిమా నుంచి 'నా కోసం' అనే లిరికల్ సాంగ్ ను వదిలారు. బాలాజీ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఆయన హిట్ సాంగ్స్ లో ఈ పాటకి చోటు దక్కింది. అంతేకాదు ఈ పాట ట్రెండింగ్ లో నిలుస్తూ, 7 మిలియన్ పైగా వ్యూస్ ను రాబట్టింది. సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలపాలని ఆలోచలో నాగ్ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.