ఏపీలో జూనియర్ కాలేజీలకు ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు
- సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు
- ఇంటర్ విద్యామండలి ఉత్తర్వులు
- అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ కాలేజీలకు జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17న కాలేజీలు తిరిగి ప్రారంభించుకోవచ్చని తెలిపింది. సంక్రాంతి నేపథ్యంలో ఇతర విద్యా సంస్థలకు కూడా ఏపీలో సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలోనూ మెడికల్ కాలేజీలు మినహా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.