'సంతోషం'.. హీరో సిద్ధార్థ్ తనకు క్షమాపణలు చెప్పడంపై స్పందించిన సైనా నెహ్వాల్
- అతడు మొదట నా గురించి పలు వ్యాఖ్యలు చేశాడు
- అనంతరం క్షమాపణలు చెప్పాడు
- ఆ వ్యాఖ్యలు ఎందుకు వైరల్ అయ్యాయో నాకు తెలియదు
- ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు
- జరిగిందేదో జరిగింది... నేను దీని గురించి బాధ పడట్లేదు
భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై సినీ నటుడు సిద్ధార్థ్ ఇటీవల చేసిన ట్వీట్ దుమారం రేపిన విషయం తెలిసిందే. అతడి ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఇప్పటికే వెనక్కి తగ్గిన సిద్ధార్థ్ క్షమాపణలు చెబుతూ గత రాత్రి ఓ లేఖ పోస్ట్ చేశాడు. దీనిపై సైనా నెహ్వాల్ స్పందించింది.
'అతడు మొదట నా గురించి పలు వ్యాఖ్యలు చేశాడు.. అనంతరం క్షమాపణలు చెప్పాడు. అతడు చేసిన వ్యాఖ్యలు అంతగా ఎందుకు వైరల్ అయ్యాయో నాకు తెలియదు. ట్విట్టర్‌లో నా పేరు ట్రెండ్ అవుతుండడం చూసి నేను ఆశ్చర్యపోయాను.. సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పినందుకు సంతోషం. ఓ మహిళను ఈ విధంగా లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయకూడదు. జరిగిందేదో జరిగింది... నేను దీని గురించి బాధ పడట్లేదు.. సంతోషంగానే ఉన్నాను.. అతడికి దేవుడు తోడుగా నిలుచుగాక' అంటూ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది.
కాగా, ఇటీవల పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సమయంలో భద్రతా వైఫల్యం తలెత్తడంతో సైనా నెహ్వాల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రధానికే భద్రత లేకుంటే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని, ఇటువంటి పరిణామాల్ని ఖండిస్తున్నానని ఆమె పేర్కొంది. అయితే, దీనిపై అప్పట్లో స్పందించిన సిద్ధార్థ్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. దీనిపై పెద్దఎత్తున దుమారం చెలరేగి.. సిద్ధార్థ్ ని ఏకిపారేశారు.